చలికాలంలో పెట్రోలియం జెల్లీ ఎక్కువగా వాడుతున్నారా.? సమస్యలు తప్పవు..

TV9 Telugu

10 November 2024

కొంతమంది వ్యక్తులు చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అలంటి వారు పెట్రోలియం జెల్లీ ఉపయోగిస్తే అలెర్జీ వస్తుంది.

పెట్రోలియం జెల్లీని పూయడానికి ముందు చర్మాన్ని సరిగ్గా శుభ్రం చేయకపోతే ఫంగల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది.

ముఖ్యంగా పిల్లలలో ముక్కు చుట్టూ పెట్రోలియం జెల్లీని ఉపయోగిస్తే దీనిలో మినరల్ ఆయిల్స్ పీల్చడం వల్ల ఆస్పిరేషన్ న్యుమోనియా రావచ్చు.

కొంతమంది పెట్రోలియం జెల్లీని ఉపయోగిస్తే చర్మ పగిలే ప్రమాదం ఉంది. జెల్లీని అప్లై చేసే ముందు చర్మాన్ని సరిగ్గా శుభ్రం చెయ్యండి.

పెట్రోలియం జెల్లీని కొద్దిగా తీసుకోని మీ శుభ్రమైన చేతులు, కాళ్ళు, పాదాలకు సన్నని పొరలాగా మెత్తగా రాయండి.

మీ మొఖంపై తేమను లాక్ చేయడానికి కొద్దిగా తడిగా ఉన్న చర్మంపై పెట్రోలియం జెల్లీని పూయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఇది మీ చర్మంపై మందపాటి పొరను ఏర్పరుస్తుంది కాబట్టి, అధిక మొత్తంలో పెట్రోలియం జెల్లీని ఉపయోగించడం మానుకోండి.

మీ చర్మం పొడిబారకుండా పోరాడేందుకు స్నానం చేసిన తర్వాత రోజుకు ఒకసారి పెట్రోలియం జెల్లీని అప్లై చేసుకోవచ్చు.