వెల్లుల్లిని ఫ్రిజ్‌లో ఉంచవచ్చా..? చెడిపోకుండా ఎలా నిల్వ చేయాలి

04 jun 2026

Anand T

ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా ఉండే పదార్థం వెల్లుల్లి. ఇది వంటలకు అద్భుతమైన రుచిని ఇవ్వడమే కాకుండా, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది.

సాధారణంగా చాలా మంది వెల్లుల్లిని బయట ఉంచుతారు. కానీ, కొందరు దానిని ముందే శుభ్రం చేసి తొక్క తీసి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తుంటారు. కానీ వెల్లుల్లిని ఫ్రిజ్‌లో ఉంచొచ్చా, లేదో తెలుసుకుందాం.

పూర్తి వెల్లుల్లి పాయలను ఎప్పుడూ ఫ్రిజ్‌లో పెట్టకూడదట. రిఫ్రిజిరేటర్‌లోని చల్లదనం, తేమ కారణంగా వెల్లుల్లికి త్వరగా బూజు పట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఫ్రిజ్‌లో ఉండే తేమ శాతానికి వెల్లుల్లి పాయలు చాలా వేగంగా మొలకెత్తుతాయి. దీనివల్ల అవి త్వరగా పాడైపోతాయి కాబట్టి పూర్తి వెల్లుల్లి గడ్డను ఎప్పుడూ ప్రిజ్‌లో ఉంచొద్దు

అధిక చలికి గురైనప్పుడు వెల్లుల్లిలో ఉండే సహజమైన గుణాలై  సువాసన, ఆరోగ్యకరమైన ఔషధ గుణాలను కోల్పోతుంది.

ఫ్రిజ్‌లో పెట్టి గుణాలు కోల్పోయిన వెల్లుల్లిని వాడటం వల్ల, కూరల రుచి చప్పగా లేదా వికారంగా అనిపించే ప్రమాదం ఉంది.

వెల్లుల్లి పాయలను ఎల్లప్పుడూ గది ఉష్ణోగ్రత వద్ద, గాలి బాగా ప్రసరించే ప్రదేశంలో మాత్రమే నిల్వ చేయడమే ఉత్తమం

వెల్లుల్లిని నిల్వ చేయడానికి ప్లాస్టిక్ కవర్లు లేదా ర్యాప్‌లను అస్సలు వాడకండి. వీటికి బదులుగా గాలి ఆడే వల సంచులు  లేదా బుట్టలను ఉపయోగించండం చాలా ఉత్తమం