ఇది పిచ్చి మొక్క కాదు.. చర్మ సమస్యలపై బ్రహ్మాస్త్రం.. 

23 August 2025

Prudvi Battula 

మీరు మీ ఇంటి చుట్టుపక్కల  సత్యనాశి లేదా బ్రహ్మదండి ముళ్ల మొక్కను చేసే ఉంటారు. ఆంగ్లంలో మెక్సికన్ ప్రిక్లీ పాపీ అని పిలుస్తారు.

సాధారణంగా చర్మ సమస్యలకు ఖరీదైన క్రీములు, మందులు వాడుతుంటారు. కానీ సత్యనాశి వంటి సహజంగా లభించే ఔషధాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.

ఈ మొక్క చర్మ సంబంధిత సమస్యలకు ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. దురద, రింగ్‌వార్మ్‌లను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ దీనిని ఒక ఇంటి చిట్కాగా ఉపయోగిస్తారు. తామర, సోరియాసిస్ వంటి సమస్యల నివారణకు కూడా సత్యనాశిని ఉపయోగిస్తారు.

ఇందులో ఉండే యాంటీసెప్టిక్, యాంటీ ఫంగల్ లక్షణాలు చర్మ వ్యాధులను త్వరగా నయం చేస్తాయి. చిన్న చిన్న గాయాలపై దీని పాలను నేరుగా పూస్తే త్వరగా నయమవుతాయి.

సత్యనాశి మొక్క కొద్దిగా విషపూరితమైనది. అందుకే దీనిని ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.

వైద్యుల సలహా లేకుండా దీనిని వాడటం ప్రమాదకరం. ముఖ్యంగా, తక్కువ మోతాదులో, బాహ్యంగా మాత్రమే ఉపయోగించాలి.

దీనిని సరైన మోతాదులో, వైద్యుల పర్యవేక్షణలో ఉపయోగిస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని అంటున్నారు నిపుణులు.