చెట్లు చిగురు తొడిగే వేళ..ఇలా చేస్తే మీ గులాబీ మొక్క నిండా పూలే పూలు!

Samatha

9 June 2026

ప్రతి ఒక్కరి ఇంటిలో పెంచుకునే పూల మొక్కల్లో ప్రత్యేకంగా ఉండేది గులాబీ. చాలా మందికి ఈ పూలు అంటే ఇష్టం.

గులాబీ

అంతే కాకుండా వీటిని అలంకరణ కోసమే కాకుండా ప్రతి పూజలో కూడా ఉపయోగిస్తారు. అందుకే చాలా మంది ఈ మొక్కను ఇంటిలో పెంచుకుంటారు.

పూల ఉపయోగాలు

అయితే తొలకరి చినుకులు ప్రారంభం అయ్యాయి. ఇప్పుడిప్పుడే మొక్కలు కొత్త చిగురు తొడిగి,  చెట్టు నిండా మొగ్గలు పెట్టి పూలు పూస్తుంటాయి.

తొలకరి వానలు

ఇక వర్షాకాలం ప్రారంభం అయ్యింది. అయితే మీరు గులాబీ మొక్కను కొనుగోలు చేస్తున్నట్లు అయితే, దట్టమైన రెమ్మలు, ఐదు ఆకులతో ఆరోగ్యంగా ఉన్న మొక్కను ఎంచుకోండి.

మొక్కలు కొనుగోలు చేయడం

మొక్క మొగ్గ వేసేందుకు చెట్టుకొమ్మల్లో దట్టంగా పెరిగినవి కట్ చేయండి దీని వలన కొమ్మలు ఎక్కువగా వచ్చి పూలు ఎక్కువగా పూస్తుంది.

మొగ్గలు

మీ చెట్టు కొత్త చిగురు తొడిగే సమయంలో కాఫీ గింజల పొడి లేదా ఉల్లిపాయ తొక్కలు, వెల్లుల్లి తొక్కలు వేయండి దీని వలన మొక్క పూలు బాగా పూస్తుంది.

కాఫీ పొడి

కోడి గుడ్డు పెంకులు గులాబీ మొక్క ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని మొక్క వేరు భాగంలో వేయడం వలన మొగ్గలు ఎక్కువగా పెట్టి చెట్టు నిండా పూలు పూస్తుంది.

కోడి గుడ్డు పెంకులు

అదే విధంగా అరటి తొక్కలను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఆ నీటిని ఉదయాన్నే గులాబీ మొక్కకు పోయడం వలన చెట్టు నిండా గుబురుగా పూలు పూస్తాయి.

అరటి తొక్కల నీరు