మొక్కజొన్న కంకులు కాల్చినవా.? ఉడికించినవా.? ఆరోగ్యానికి ఏది మంచిది?
30 July 2025
Prudvi Battula
ఉడికించిన మొక్కజొన్నలో విటమిన్ బి1, బి5, సి, మెగ్నీషియం, భాస్వరం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి, ఇవి మొత్తం ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి.
ఉడికించిన మొక్కజొన్న కంకిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీంతో మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఉడికించిన వాటిలో విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం వల్ల అనారోగ్యం దరిచేరదు.
ఉడికించిన మొక్కజొన్న కంకిలో ఉండే లుటిన్, జియాక్సంతిన్ వంటి పోషకాలు కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. దీంతో కంటి సమస్యలు రావు.
కాల్చిన మొక్కజొన్న ఉడికించిన వాటి కంటే ప్రత్యేకమైన రుచి ఉంటుంది. అందుకే ఇది చాలా మంది ప్రజలకు నచ్చుతుంది.
కాల్చిన మొక్కజొన్నలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్లు గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. దీంతో గుండె సమస్యలు తగ్గుతాయి.
కాల్చిన మొక్కజొన్నలో ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది ఉదరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
కాల్చిన వాటిలో పీచు పదార్థాలు కడుపు నిండుగా ఉన్న భావనను కలిగిస్తాయి. తద్వారా అతిగా తినకుండా ఉంటారు. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ ప్రభుత్వ యాప్‌లతో కాలు కదపకుండా ఇంటి నుండే పనులు..
ఫుడ్ ప్యాక్‌పై రెడ్, గ్రీన్ కాకుండా మరో రెండు చుక్కలు.. వాటి గురించి తెలుసా.?
మంగళవారం ఈ పనులు చేస్తే.. డబ్బే డబ్బు..