సమ్మర్‌లో రోజూ ఈ ఒక్క డ్రింక్‌ తాగితే.. బాడీలో ఏసీని పెట్టుకున్నట్టే!

Anand T

25 may 2026

బయట ఎండు మండిపోతున్నాయి. ఈ ఎండల నుండి ఉపశమనం పొంది, ఈ వేసవిలో ఆరోగ్యంగా ఉండటానికి ఈ దోసకాయ,చియాసీడ్స్‌, విత్‌ పుదీనాతో చేసిన డ్రింక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. 

సమ్మర్ డ్రింక్

 ఈ హెల్తీ డ్రింక్‌ను తయారు చేసేందుకు దోసకాయ , సబ్జా గింజలు లేదా చియా సీడ్స్, పుదీనా కావాలి. ఇవి ఉంటే చాలూ చాలా సులభంగా ఈ డ్రింక్ తయారు చేసుకోవచ్చు.

కావలసిన పదార్థాలు

 ఇందులో ఉపయోగించే దోసకాయ శరీరానికి కావలసినంత నీటి శాతాన్ని అందిస్తూ, డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది.

శరీరానికి హైడ్రేషన్

 అలాగే ఇందులో ఉండే పుదీనా ఆకులు జీర్ణక్రియను మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడతాయి.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది

అంతేకాదు పుదీనా శరీరానికి తక్షణమే మంచి చలవను అందిస్తుంది. దీని ద్వారా మనసుకు హాయిని ఇస్తుంది.

చలువ చేస్తుంది

చియా సీడ్స్ లేదా సబ్జ గింజల్లో  ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి

పోషకాల గని

 ఈ గింజల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో మంట, వేడిని తగ్గించడానికి తోడ్పడతాయి.

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ

 ఈ సమ్మర్ కూలర్ చాలా తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది, కాబట్టి బరువు పెరగుతారనే భయం కూడా ఉండదు.

తక్కువ క్యాలరీలు