11 December 2023

ఇక మనం నచ్చిన కలలను కనేయొచ్చు.!  అదెలాగో చూసేద్దామా.!

నిద్రలో మనకు రకరకాల కలలు వస్తుంటాయి. కొన్ని భయపెట్టేవి మరికొన్ని ఉల్లాసపరిచేవి ఉంటాయి. 

కలల్ని సైతం నియంత్రించే అద్భుతమైన పరికరాన్ని అమెరికాలోని ‘ప్రొఫెటిక్‌’ అనే 'స్టార్టప్‌ అభివృద్ధి చేస్తోంది. 

"హాలో ' సాధనం ఒక కిరీటంలా ఉంటుంది. అది అల్ట్రాసౌండ్‌, మెషీన్‌ లెర్నింగ్‌ల ఆధారంగా పనిచేస్తుంది. నిద్రపోయే ముందు తలకు దీన్ని ధరించాలి.

ఈ సాధనం.. మనం లూసిడ్‌ కలల దశలో ఉన్నప్పుడు వచ్చే స్వప్నాలను విశ్లేషిస్తుంది. 

మనం ఏ తరహా కలల్ని కనాలనుకొంటున్నామో వాటిని ప్రోగ్రామింగ్‌ ద్వారా ‘హాలో’ సాధనం ప్రవేశపెడుతుంది.

కెరీర్‌కు అవసరమైన నైపుణ్యాలను సాధించేలా ఈ కలల ద్వారానే ప్రణాళిక వేసుకోవచ్చు. 

ఉదాహరణకు ఒక సీఈవో.. జరగబోయే బోర్డు సమావేశంపై కలలోనే కసరత్తు చేసుకోవచ్చట.

ఈ పరికరం ధర రూ. 1.25లక్షల నుంచి రూ.1.66 లక్షల మధ్య ఉండొచ్చని ప్రొఫెటిక్‌ సంస్థ తెలిపింది.