భారతదేశం తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 17 సార్లు (1947-1963) ఎర్రకోటపై అత్యధిక సార్లు జాతీయ జెండాను ఎగరవేసిన రికార్డు కలిగి ఉన్నారు.
మొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ16 సార్లు (1966-1977, 1980-1984) 11 సార్లు జాతీయ జెండాను ఎగురవేశారు.
ప్రస్తుత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సార్లు (2014-2025) ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేసి అత్యధిక సార్లు జాతీయ జెండాను ఎగరవేసినవారు రెండో స్థానంలో ఉన్నారు.
భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ స్వతంత్ర దినోత్సవం వేడుకల్లో 10 సార్లు (2004-2013) ఎర్రకోటపై ఎగరవేశారు.
అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా పని చేసిన సమయం 6 సార్లు (1998-2003) ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరవేశారు.
ఇందిరా గాంధీ తనయుడు, దేశ మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 5 సార్లు (1985-1989) ఎర్రకోటపై జెండా ఎగరవేశారు.
పి.వి. నరసింహారావు స్వతంత్ర దినోత్సవం సంబరాల్లో 5 సార్లు (1991-1995) ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరవేశారు. అయన ప్రధానిగా పని చేసిన ఏకైక తెలుగు వ్యక్తి.
దేశ రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 2 సార్లు; మొరార్జీ దేశాయి 2 సార్లు; చరణ్ సింగ్, వీపీ సింగ్, హెచ్.డీ దేవ్ గౌడ్, ఐ.కె.గుజ్రాల్ ఒక్కోసారి జెండా ఎగరవేశారు.