సరిగ్గా పండని బొప్పాయిలో రబ్బరు పాలు ఉంటాయి. ఇది సంకోచాలను ప్రేరేపిస్తుంది. అందుకే గర్భిణీలు బొప్పాయికు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
కాబోయే తల్లులు పైనాపిల్‌ను తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులోని బ్రోమెలైన్ అనే ఎంజైమ్ సంకోచాలకు కారణమవుతుందని చెబుతున్నారు.
మామిడి పండు ఆరోగ్యాన్ని ఎంతో మంచిదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే సరిగా పండని మామిడిలో గర్భాశయ సంకోచాలకు కారణమయ్యే సమ్మేళనాలు ఉంటాయి. కాబట్టి గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
గర్భిణీలు పనస పండుకు కూడా దూరంగా ఉండడం మేలు అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరిలో జీర్ణ సంబంధిత సమస్యలకు దారి తీసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
ద్రాక్ష పండ్లను అధికంగా తీసుకుంటే మధుమేహం వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా వీటిని అధికంగా తీసుకుంటే.. పునరుత్పత్తి, పిండం అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని అంటున్నారు.
కాగా.. గర్భిణీలు తప్పకుండా తినాల్సిన పండ్లలో ఆరెంజ్ ఒకటి. ఇందులోని విటమిన్ సి శిశువు ఎముకలు, దంతాల పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
గర్భిణీలు కచ్చితంగా తీసుకోవాల్సిన పండ్లలో యాపిల్ ప్రధానమైంది. రోజుకో యాపిల్ తినడం వల్ల శిశువు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జన్మించిన తర్వాత ఆరోగ్యంగా ఉంటారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.