స్టవ్‌ పక్కనే ఆయిల్ పెడుతున్నారా? అంతే సంగతులు..

TV9 Telugu

11 June 2024

సాధారణంగా మహిళలు వంట చేసేటప్పుడు అవసరమైన వస్తువులను చేతికి అందేలా పెట్టుకుంటారు. అలాంటి వాటిలో నూనె ఒకటి.

వంటల్లో దీని అవసరం ఎక్కువ కాబట్టి స్టవ్‌కు దగ్గర్లో పెట్టుకుంటూ ఉంటారు. అయితే, ఇది అత్యంత ప్రమాదకరమని అధ్యయనంలో తేలింది.

ఇలా చేయడం వల్ల కాన్సర్ బారినపడే ప్రమాదం ఉంది.  గ్యాస్ స్టవ్ పక్కనే నూనెను ఉంచడం వల్ల ఆ వేడికి నూనెలో ఆక్సిడైజేషన్ ప్రక్రియ వేగవంతమవుతుందట.

సాధారణంగా నూనెలో కొవ్వులు అధికంగా ఉంటాయి. నూనె భద్రపరిచిన సీసాను తెరిచిన వెంటనే క్లోజ్ చేయపోతే కొవ్వు పదార్థాలు క్షీణించి రుచి మారుతుంది.

ఈ నూనెను వాడడం వల్ల వృద్ధాప్యం వేగవంతమవడమే కాకుండా కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగి ఊబకాయం, జీర్ణ సంబంధిత వ్యాధులు తలెత్తుతాయి.

ఈ సమస్యల బారినపడకుండా ఉండాలంటే నూనెను తీసుకొచ్చిన వాటిలోనే ఉంచాలి. గాలి, వెలుతురు చొరబడకుండా గట్టిగా మూతపెట్టాలి.

వెజిటబుల్ ఆయిల్స్‌ను చల్లగా ఉండే వెలుతురు సోకని చోట ఉంచాలి. మూత తెరిచిన తర్వాత మూడు నుంచి ఆరు నెలల్లోపు ఉపయోగించాలి.

వాల్‌నట్, హేజెల్‌నట్, ఆల్మండ్ నూనెలను మాత్రం ఎప్పుడు ఫ్రిజ్‌లో భద్రపరచడం మేలు. లేదంటే త్వరగా పాడైపోతాయి.