కారు డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ పొరపాటు అస్సలు చేయకండి..!

TV9 Telugu

03 February 2025

కారు డ్రైవింగ్ చాలామంది చేస్తారు. సుదూర ప్రాంతాలకు సైతం ఎక్కువమంది సొంత కారులోనే వెళ్ళడానికి ఇష్టపడతారు.

ఎంత బాగా డ్రైవింగ్ చేసినప్పటికీ మీరు చేసిన కొన్ని చిన్ని పొరపాట్లు వల్ల మీ కారు త్వరగా పాడైపోతుంది.

పాదాన్ని నిరంతరం క్లచ్‌పై ఉంచినట్లయితే, క్లచ్ ప్లేట్ త్వరగా పాడైపోతుంది. నిర్వహణ ఖర్చు పెరుగుతుంది.

బ్రేక్‌లను అనవసరంగా నొక్కడం వల్ల కూడా బ్రేక్ ప్యాడ్‌లు త్వరగా అరిగిపోయి బ్రేకింగ్ సిస్టమ్ బలహీనపడుతుంది.

అవసరం లేనప్పుడు, మీ పాదాన్ని క్లచ్ మరియు బ్రేక్ నుండి తీసివేసి నేలపై ఉంచండి. నిజంగా అవసరమైనప్పుడు మాత్రమే బ్రేకులు, క్లచ్ ఉపయోగించండి.

కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు సౌకర్యవంతమైన బూట్లు ధరించండి. తద్వారా పాదాలకు సరైన పట్టు, కదలిక వస్తుంది.

డ్రైవింగ్ చేసేటప్పుడు "హాఫ్ క్లచ్"ని నివారించండి, ఇది క్లచ్ ప్లేట్‌ను త్వరగా పాడుకాకుండా మైలేజీని కాపాడుతుంది.

కారులో అందించిన డెడ్ పెడల్‌ను ఉపయోగించండి. తద్వారా పాదం రిలాక్స్‌డ్ ఉంటుంది. అవసరమైనప్పుడు త్వరగా స్పందించగలదు.