19 October 2023
అరికాళ్లల్లో మంటలున్నవారు నడిచేటప్పుడు విపరీతమైన నొప్పితో ఇబ్బంది పడతారు. పాదాల్లో నరాలు దెబ్బతినడం వల్ల ఇలా జరుగుతుంది.
వాస్తవానికి శరీరంలో నరాలపై ఒక కవచం ఉంటుంది. ఈ కవచం దెబ్బతింటే నరాల మంటలు వస్తూ ఉంటాయి.
షుగర్ పేషేంట్స్ కు ఈ నరాల కణాలకు రక్తంలో ఉండే షుగర్ సరిగ్గా అందకపోవడం వల్ల రక్షణ కవచం దెబ్బతింటుంది.
షుగర్ పేషేంట్స్ కు రక్తప్రసరణ సరిగ్గా జరగక పోయినా నరాలు దెబ్బతిని తీవ్ర పాదాలు మంటలతో ఇబ్బంది పడతారు
నరాలపై ఉండే కవచం విటమిన్ బి 12తో తయారవుతుంది. దీంతో ఈ విటమిన్ తక్కువగా ఉంటే నరాలు దెబ్బతింటాయి.
శరీరంలోని సయాటికా నరం తీవ్ర ఒత్తిడికి గురైనా అరికాళ్లల్లో మంటలతో ఇబ్బంది పడతారు.
రక్తం తక్కువగా ఉన్నవారిలో పాదాలకు రక్తప్రసరణ సరిగ్గా సాగక అరికాళ్లలో మంటలు వస్తాయి.
హెచ్ఐవి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ , క్యాన్సర్ , మూత్రపిండాల వైఫల్యంతో బాధపడే వారిలో కూడా నరాలు దెబ్బతిని పాదాల్లో మంటలు వస్తూ ఉంటాయి.
ఈ సమస్యతో బాధపడే వారు నొప్పి, మంట తగ్గడానికి గట్టిగా ఉండే చెప్పులు కాకుండా మెత్తగా ఉండే ఆర్థో చెప్పులను వాడాలి