ఈ చిట్కాలతో నల్లని పెదాలు.. గులాబీ రంగులో మెరిసిపోతాయి

Phani.ch

07 May 2024

ప్రతి రోజు మనం శరీరంపై శ్రద్ధ పెట్టినట్టే పై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కువగా వారి పెదవులపై శ్రద్ద పెడుతుంటారు.

కొంతమంది కి పెదాలు నల్లగా మారుతుంటాయి. ఈ చిట్కాలతో నల్లగా మారిన మీ పెదాలు తిరిగి పింక్ కలర్‌లోకి మార్చవచ్చు.

ప్రతి రోజు బీట్‌రూట్ పెదాలకు రాయడం వల్ల నల్లగా ఉండే మీ లిప్స్ పింక్ రంగులో మారుతుంటాయి. ఇందులో ఉండే బీటాలెన్స్ నిగారింపుకు ఉపయోగపడతాయి.

కీరా కేవలం కంటి కింద డార్క్ సర్కిల్స్ కోసమే కాదు పెదాల నల్లదనాన్ని పోగొట్టేందుకు కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది.

ఇందులో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి వల్ల పెదాలకు లాభం కలుగుతుంది. కీరా రసాన్ని రోజూ పెదాలకు రాయడం మంచి అలవాటు.

 పంచదార తేనే కలిపి స్క్రబ్ చేయడం ద్వారా డెడ్ స్కిన్ పోయి పెదాలకు నిగారింపు కలుగుతుంది. నల్లదనం దూరం చేసేందుకు పంచదారతో మీ పెదాల్ని స్క్రబ్ చేస్తుండాలి.

పెదాలకు మాయిశ్చరైజర్ చాలా అవసరం. అందువల్ల  పెదాలకు కూడా రోజూ మాయిశ్చరైజర్ రాస్తుండాలి. నిమ్మకాయతో పెందాల్ని రోజూ మసాజ్ చేస్తే మంచి ఫలితాలుంటాయి.

 పంచదార-తేనె-మీగడ పెదాలు మృదువుగా, పింక్ రంగులో మెరిసిపోతాయి. తేనె-పంచదార-మీగడను కలిపి ఈ మిశ్రమాన్ని రోజూ పెదాలకు రాస్తుండాలి.