క్యారెట్ ఉపయోగాలు తెలిస్తే  కంగు తినాల్సిందే

Phani CH

19 October 2024

చాలా మంది పచ్చి క్యారెట్ తింటుంటారు.. పైగా క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే.. వాటి వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

క్యారెట్ తినడానికి రుచిగా కొంత తీపిదనంతో ఉంటుంది.. దీని లో అనేక పోషకాలు కలిగిఉంటాయి. రోజుకో క్యారెట్ తింటే ఆరోగ్యం చెప్పుకోతగ్గ రీతిలో మెరుగవుతుంది.

 క్యారెట్‌ లో బీటా-కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ Aగా మారుతుంది. ఈ పోషకం.. కంటి చూపును పెంచుతుంది. 

క్యారెట్‌లో లుటీన్, జియాక్సంతిన్ అనే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి వయస్సు పెరిగేటప్పుడు వచ్చే మచ్చల నుంచి రక్షించగలవు.

 క్యారెట్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది పేగు కదలికలను పెంచి మలబద్ధక సమస్యను నివారిస్తుంది. జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది.

క్యారెట్‌ గుండె ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

క్యారెట్‌లో ఉండే విటమిన్ A, యాంటీఆక్సిడెంట్లు చర్మపు మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఆరోగ్యకరమైన, మరింత కాంతివంతమైన చర్మం తయారవుతుంది.