పోహా ఇడ్లీ మీకు తెలుసా.? ఎలా తయారు చేసుకోవాలంటే..

TV9 Telugu

18 July 2024

పోహా ఇడ్లీ తయారికి కావలసిన పదార్థాలు అటుకులు 1 కప్పు, రైస్ రవ్వ 1.1/2 కప్పు, పెరుగు 1 కప్పు, ఫ్రూట్ సాల్ట్ 3/4 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి తగినంత.

ముందుగా అటుకులను 10 నిమిషాలపాటు నీటిలో నానబెట్టుకుని.. మిక్సీ జార్ లో వేసి ముతకగా వచ్చేవరకు రుబ్బుకోవాలి.

ఈ పిండిని గిన్నెలోకి తీసుకుని.. దానికి 1 కప్పు పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. పిండిలో పెరుగు పూర్తిగా కలిసిపోయేంతవరకూ కలపాలి.

ఇందులో 1/2 కప్పు బియ్యంరవ్వ లేదా ఉప్మా రవ్వ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో 1 కప్పు నీరు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి.

ఒక అరగంట పాటు మూతపెట్టి నాననివ్వాలి. తర్వాత ఈ మిశ్రమంలో మరో అరకప్పు నీరుపోసి బాగా కలిపి.. చివరిగా ఫ్రూట్ సాల్ట్ వేసి కలుపుకోవాలి.

ఇడ్లీ కుక్కర్ తీసుకుని..అందులోని ప్లేట్స్ కు ఆయిల్ రాసి.. పోహా ఇడ్లీ పిండిని వేసి.. 15 నిమిషాలపాటు ఉడికించుకోవాలి.

అంతే టేస్టీ టేస్టీ పోహా ఇడ్లీ రెడీ. ఈ ఇడ్లీని చట్నీ, సాంబారుతో సర్వ్ చేసుకుని తింటే.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.

దీని టేస్ట్ చూస్తే మీతో పాటు మీ పిల్లలు కూడా అస్సలు వదలరు మళ్లీ మళ్ళీ తినాలనుకుంటారు. దీనితో ఆరోగ్యం.