వారే వా !! వాల్ నట్స్ తింటే  ఇన్ని ప్రయోజనాలా !!

Phani CH

03 OCT 2024

వాల్ నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల రక్తపోటును సైతం  తగ్గుతుంది.

వాల్ నట్స్ లో పాలి ఫినోల్స్ పుష్కలంగా ఉంటుంది. ఇది నొప్పులను తగ్గించడానికి ఉపయోగపడతాయి. వాల్నట్ గింజలు రెగ్యులర్ గా తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

వాల్ నట్స్ లో పుష్కలంగా ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉంటాయి. ఇది మీ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఏర్పడకుండా చేస్తుంది

వాల్ నట్స్ లో ఉండే ఫైబర్ ఇన్సులిన్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఇదొక మంచి ఔషధం అనే చెప్పాలి.

వాల్ నట్స్ ప్రతి రోజు తినడం వల్ల మెదడును చురుకుగా పని చేస్తుంది. అంతే కాకుండా త్వరగా వృద్ధాప్యం బారిన పడకుండా వాల్ నట్స్ కాపాడతాయి.

వాల్‌నట్‌లను క్రమం తప్పకుండా తినడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. అధిక రక్తపోటును కూడా తగ్గిస్తుంది.

వాల్ నట్స్ లో కార్డియో ప్రొటెక్టివ్ లక్షణాలు ఉన్నాయి. ఇది గుండె సంబంధిత వ్యాధులకు గురయ్యే అవకాశం తగ్గిస్తుంది.