నిమ్మరసంతో మీ అందం వందింతలు అవుతుంది.. చర్మం వజ్రంలా మెరుస్తుంది.. 

22 August 2025

Prudvi Battula 

నిమ్మలో సహజసిద్ధమైన క్లెన్సింగ్‌ గుణాలు ఉంటాయి. వీటి వల్ల చర్మం బాగా శుభ్రపడి ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

ఒక నిమ్మచెక్కను తీసుకుని ట్యాన్‌ ఉన్న చోట రోజూ 5 నిమిషాల పాటు బాగా రుద్దితే ట్యాన్ తగ్గుముఖం పడుతుంది.

ప్రతి రోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే కొవ్వు తగ్గుతుంది. ఈ డిటాక్స్ డ్రింక్ బరువును తగ్గించడమే కాకుండా చర్మ సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది

లెమన్ వాటర్‌లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఇతర ఖనిజాలు ఉంటాయి. ఈ పానీయం చర్మం మంటను తగ్గించడంలోనూ ఉపయోగపడుతుంది

నిమ్మరసంలోని విటమిన్ సి చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. లెమన్ వాటర్‌ను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చర్మం బిగుతుగా మారి, ముడతలు రాకుండా ఉంటుంది

రోజూ లెమన్ వాటర్ తాగడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. శరీరం హైడ్రేటెడ్ గా ఉంటే చర్మం కూడా మెరుగ్గా ఉంటుంది. చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు

నిమ్మరసం నీరు నిర్విషీకరణలో సహాయపడుతుంది. ఇది శరీరం నుంచి మలినాలను తొలగిస్తుంది. దీని వల్ల మచ్చలు లేని మెరిసే చర్మాన్ని సులభంగా పొందవచ్చు

లెమన్ వాటర్ చర్మం pH ని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. ఈ డ్రింక్ తాగడం వల్ల చర్మంపై దద్దుర్లు, మొటిమలు, మంటలు రావు. ఇది చర్మాన్ని లోపలి నుండి మెరిసేలా చేస్తుంది. ప్రకాశాన్ని పెంచుతుంది