బ్రేకప్ అయిందా  ?? మళ్ళీ ఇవే తప్పులు చేస్తే మీ పని బిస్కెట్ 

Phani CH

14 December 2024

రిలేషన్ షిప్ అనేది కేవలం భార్యాభర్తల మధ్యనే ఉండేది కాదు.. ఇద్దరి స్నేహితుల మధ్య.. ఇద్దరి ప్రేమికుల మధ్య ఉండేది కూడా ఉండే సంభంధం కూడా రిలేషన్ షిప్ అంటారు.

ఏ రిలేషన్ షిప్ లో అయినా చివరి వరకు ఉండాలి అంటే ఒకరిని ఒకరు బాగా అర్ధం చేసుకుని ఉండాలి.. ఎందుకంటే బ్యాడ్ రిలేషన్ మీ మానసిక ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది.

అయితే కొంతమంది మధ్యలోనే బ్రేక్ అప్ చెప్పి విడిపోతుంటారు.. పాత రిలేషన్ మర్చిపోవడం కోసం కొత్త రిలేషన్ షిప్ లోకి అడుగుపెడతారు. మరల కొత్త రిలేషన్ షిప్ లోకి అడుగు పెట్టేవారు ఈ విషయాలు తెలుసుకోవడం ముఖ్యం 

మీరు బ్రేకప్ చెప్పిన తరువాత మీరు ప్రేమించిన వ్యక్తి మరచిపోలేకపోతే మరొక సంబంధాన్ని ప్రారంభించకండి. పాటవారిని మర్చిపోవడం కోసం మరొకరిని ఇష్టపడితే అది విషపూరితంగా మారచ్చు.

ప్రస్తుతం ప్రేమించే వారి దగ్గర మీ పాత ఎక్స్ గురించి పదే పదే ప్రస్తావించడం తలుచుకోవడం వారి గురించి ప్రస్తావించినట్లయితే మీరు మళ్లీ ఇంకొకరితే రిలేషన్ లో కొనసాగడానికి సిద్ధంగా లేరనే అర్థం.

మీరు ఒంటరిగా ఆనందించడం నేర్చుకునే వరకు మరొకరితో కొత్త రిలేషన్ మొదలుపెట్టకండి. అప్పుడే మీరు మీ జీవితంలోకి తరువాత వచ్చే వ్యక్తులను సంతోషంగా ఉంచగలరు.

టైం పాస్ కోసం ఒక రిలేషన్ లో నుంచి మరొక రిలేషన్ షిప్ లోకి వెళ్లడం మీకు మంచిది కాదు. ఇలా చేసే వ్యక్తులు నిరాశకి గురవక తప్పదు.