దొండకాయను దూరం పెడుతున్నారా..?ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
Jyothi Gadda
01 November 2024
TV9 Telugu
దొండకాయ పేరు వినగానే చాలా మంది ముఖం చిట్లించుకుంటారు. దీన్ని తినడానికి అంతగా ఇష్టపడరు. కానీ, ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. అసలు వదలిపెట్టరని నిపుణులు అంటున్నారు.
TV9 Telugu
దొండకాయలో ఫైబర్, విటమిన్–బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్–సి , క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
TV9 Telugu
దొండకాయ, దొండ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు. వారంలో ఒక రోజు దొండ కాయ తిన్నా, దొండ ఆకుల రసం తాగినా మంచిదట.
TV9 Telugu
దొండకాయలో థయామిన్ ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్‌లను గ్రూకోజ్‌గా మార్చే పోషకం. ఇది శరీరంలో శక్తి స్థాయిలను ఎక్కువగా ఉంచుతుంది, జీవక్రియను నియంత్రిస్తుంది.
TV9 Telugu
దొండకాయలోని థయామిన్ రక్త ప్లాస్మాలోకి ప్రవేశిస్తుంది, ఇది మరింత శక్తిని ఉత్పత్తి చేస్తుంది. థయామిన్ ఎర్ర రక్త కణాల తయారీకి కూడా సహాయపడుతుంది. రక్తహీనత తగ్గుతుంది.
TV9 Telugu
దొండకాయ కొన్ని జన్యుపరమైన వ్యాధులను కూడా నయం చేస్తుంది. దొండకాయలు తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. ముఖ్యంగా మహిళలకు గుండె ఆరోగ్యానికి మంచిది.
TV9 Telugu
దొండకాయలో ప్రయోజనకరమైన లక్షణాలతో నిండి ఉన్నాయి. దొండకాయ శరీర అలసట, బలహీనతను తగ్గిస్తుంది. ఆరోగ్యానికి మంచిది. ఫైబర్ అధికంగా ఉండి జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది.
TV9 Telugu
ఈ దొండకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి వంటి పోషకాలు.. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.