బొప్పాయిలో విటమిన్లు, ఖనిజాలతో పాటు పొటాషియం, ఫైబర్, ఫోలేట్ పుష్కలంగా ఉన్నాయి. ఖాళీ కడుపుతో ప్రతిరోజూ ఒక కప్పు బొప్పాయి ముక్కలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటే.. శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి. బొప్పాయి పండును ఖాళీ కడుపుతో తింటే జీర్ణవ్యవస్థ బలపడటంతో పాటు పొట్ట సమస్యలను నివారిస్తుంది.
ముఖ్యంగా మలబద్ధకంతో బాధపడే వారికి ఈ పండు చాలా మేలు చేస్తుంది. మలబద్ధకంతో బాధపడేవారు ఉదయాన్నే దీన్ని తీసుకోవాలి.
ఫైబర్ పుష్కలంగా ఉన్నందున, ఇది ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. బొప్పాయిని ఖాళీ కడుపుతో తింటే అజీర్ణం, ఎసిడిటీ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.