నేరేడు తో అనేక సమస్యలు పరార్

TV9 Telugu

27 June 2024

నేరేడు అనేక అనారోగ్య సమస్యలకు ఒక గొప్ప ఔషధంలా పనిచేస్తుందని నిపుణులు చెప్తున్నారు.. వీటిలో అనేక పోషకాలు ఉంటాయి.

మనకు వర్షాకాలంలో ఈ పండ్లు ఎక్కువగా దొరుకుతాయి. నేరేడు సహజ రోగ నివారిణి.. దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

నేరేడు లో విటమిన్ సి, ఫైటోకెమికల్స్, ఫినాలిక్ ఆమ్లంతో పాటు ఇతర పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

నేరేడు క్రమం తప్పకుండ ప్రతిరోజూ తింటే దగ్గు, బీపీ వంటివి తగ్గుతాయి. అంతే కాకుండా అనేక దీర్ఘకాలిక రోగాలు రాకుండా చేస్తాయి.

నేరేడు జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరచి మలబద్ధకం, గ్యాస్ ట్రబుల్, అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అధిక దాహం మూత్రం వంటి లక్షణాలను కూడా ఇవి తగ్గిస్తాయి.

నేరేడు తో మధుమేహం వ్యాధిగ్రస్తులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి.. దీనిలో ఉండే పీచు పదార్ధం రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా చేస్తాయి.

నేరేడులో ఉండే ఫైటో కెమికల్స్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ప్రతి రోజు నేరేడు తినడం వల్ల గుండె జబ్బులు అదుపులో ఉంటాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.