హైదరాబాద్ టూ అయోధ్య వయా వారణాసి.. ఐఆర్సిటీసి నయా టూర్ ప్యాకేజీ.. 

25 May 2025

Prudvi Battula 

అయోధ్య వెళ్లేవారి కోసం తాజాగా ఐఆర్సిటీసి 'గంగా రామాయణ పుణ్య క్షేత్ర యాత్ర' పేరుతో అయోధ్య టూర్ ప్యాకేజీని ప్రకటించింది.

ఈ టూర్ 9 రోజులు, 8 రాత్రులు కొనసాగనుంది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకొంటే వచ్చే నెల 14న సికింద్రాబాద్ నుంచి యాత్ర స్టార్ట్ అవుతుంది.

ఈ టూర్ ప్యాకేజీలో వారణాసి, అయోధ్య, నైమిశారణ్య, ప్రయాగ్‌రాజ్, శృంగవర్‌పూర్ పుణ్య క్షేత్రాలను దర్శించుకోవచ్చు.

భారత్ గౌరవ్ టూరిస్ట్స్ రైలు ద్వారా 2AC, 3AC, SL తరగతులలో “గంగా రామాయణ పుణ్య క్షేత్ర యాత్ర” టూర్ ప్యాకేజీని నడపాలని ప్రతిపాదించింది.

ఈ టూర్ ధరలు విషయానికి వస్తే ఎకానమీ (SL) పెద్దలకు రూ. 16,200,  పిల్లలకు రూ. 15,200గా నిర్ణయించింది రైల్వే శాఖ.

అలాగే స్టాండర్డ్ (3AC) పెద్దలకు రూ. 26,500, పిల్లలకు రూ. 25,300; కంఫర్ట్ (2AC) పెద్దలకు రూ. 35,000, పిల్లలకు రూ. 33,600గా ఉన్నాయి.

సికింద్రాబాద్, జనగాం, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం, పలాస ఈ ప్యాకేజీ బోర్డింగ్ పాయింట్స్.