కాల్చిన శెనగలు మీ డైట్లో ఉంటే.. ఆ సమస్యలపై సమరభేరి మోగినట్టే..
17 August 2025
Prudvi Battula
కాల్చిన శెనగలును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. ఇది శరీరాన్ని యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంచడంలో ఉపయోగపడుతుంది.
కాల్చిన శెనగల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
బరువు తగ్గాలనుకునే వారికి శెనగలు బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇందులోని ఫైబర్ కంటెంట్ కారణంగా త్వరగా బరువు తగ్గుతారు. కేలరీలు సైతం తక్కువగా ఉంటాయి.
కాల్చిన శెనగల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను, దంతాలను బలోపేతం చేయడానికి తోడ్పడుతుంది. శరీరానికి కావాల్సిన కాల్షియం లభిస్తుంది.
శెనగల్లో మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బీపీ ఉన్న వారు సాయంత్రం స్నాక్స్ రూపంలో శనగలను తీసుకోవాలి.
ఇక శెనగాల్లో రాగి, ఫాస్పరస్ సైతం మెండుగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
షుగర్ పేషెంట్స్‌కి సైతం శెనగలు ఎంతో మేలు చేస్తాయి. ఇందులోని గ్లైసెమిక్ ఇండెక్స్ రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ ఉంచడంలో ఉపయోగపడుతుంది.
కాల్చిన శెనగల్లో ఫైబర్ కారణం వీటిని తింటే కుడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. దీంతో తక్కువ తిని బరువు తగ్గుతారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
మీ ఆధార్ దుర్వినియోగం అయిందని సందేహమా? ఇలా తెలుసుకోండి..
ఫాస్టాగ్ వాడుతున్నారా.? ఈ టెక్నాలజీతో మీ మనీ సేవ్..
రోజుకో రకమైన నగలు ధరిస్తే.. గ్రహ దోషాలన్నీ ఫసక్..