ఇవి పిచ్చి ఆకులు అనుకునేరు.. పవర్‌ఫుల్‌.. దెబ్బకు తిప్పలన్నీ దూరం..

04 October 2024

Shaik Madar Saheb

ప్రకృతిలో ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి.. అలాంటి వాటిలో తిప్పతీగ ఒకటి.. తిప్పతీగతో శరీరంలోని తిప్పలన్నీ దూరం అవుతాయి.. 

అందుకే.. తిప్పతీగను తిరుగులేని ఔషధ మొక్కగా పేర్కొంటారు.. దీనిని ప్రాచీన కాలం నుండి ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు.

దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు దగ్గు, జలుబుతోపాటు ఉబ్బసం, గురక, శ్వాసకోశ సమస్యలను నివారిస్తాయి.. ఛాతీ సమస్యలను దూరం చేస్తుంది.

ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. తిప్పతీగ రసం తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. మలబద్దకం దూరమవుతుంది. కంటిచూపు మెరుగుపడుతుంది.

మధుమేహం, చర్మవ్యాధులు, కొన్ని కీళ్ల వ్యాధులు, నులిపురుగులు, జ్వరం, దగ్గు మొదలైన వాటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

తిప్పతీగ రసం తీసుకోవడం ద్వారా చర్మవ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. కీళ్ల వాపు, నొప్పి, మంట వంటివి తగ్గుతాయి.

తిప్పతీగ జ్యూస్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను మెరుగుపరచడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.  

తిప్పతీగ కషాయాన్ని ఉదయాన్నే తాగితే చాలా మంచిది.. రసం తాగొచ్చు.. లేదా పౌడను నీళ్లలో కలిపి తీసుకోవచ్చు.. 

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే..  వీటిని ఫాలో అయ్యే ముందు వైద్య నిపుణులను సంప్రదించండి