ఈ తప్పులు చేస్తే.. మీ వాట్సాప్ ఖాతా బ్యాన్!
15 August 2025
Prudvi Battula
ప్రస్తుతం దాదాపు అందరు వాట్సాప్ ఉపయోగిస్తున్నాను. ఇది మన పర్సనల్ నుండి ప్రొఫెషనల్ వరకు జీవితం భాగం ఐంపోయింది.
దిగ్గజ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రతి నెలా లక్షలాది ఖాతాలను ఎందుకు లాక్ చేస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
వాట్సాప్ ప్రతి నెలా ఒక నివేదికను విడుదల చేస్తుంది. ఇది ఎన్ని ఖాతాలపై చర్యలు తీసుకున్నారనే సమాచారాన్ని అందిస్తుంది .
మీరు నివారించాల్సిన మొదటి తప్పు ఏమిటంటే, చాటింగ్ చేస్తున్నప్పుడు అయా గ్రూపుల్లో ద్వేషాన్ని వ్యాప్తి చేసే ఏ పని చేయకండి. లేకుంటే ఖాతా బ్లాక్ చేవచ్చు.
వాట్సాప్‌లో నకిలీ వార్తలను ఫార్వార్డ్ చేసే పొరపాటు చేయకండి. ఎవరైనా మీ ఖాతాను రిపోర్ట్ చేస్తే మీ ఖాతాను నిషేధించవచ్చు.
వాట్సాప్‌లో అశ్లీల కంటెంట్‌ను షేర్ చేసే పొరపాటు చేయకండి. అవతలి వినియోగదారుడు మీ గురించి ఫిర్యాదు చేస్తే మీ ఖాతా నిషేధించవచ్చు.
అనుమతి లేకుండా ఒక గ్రూపులో యూజర్‌ను యాడ్ చేసే పొరపాటు చేయకండి. మీపై ఫిర్యాదు వస్తే మీ అకౌంట్ నిషేధిస్తారు.
వాట్సాప్‌లో తెలియని వ్యక్తులకు సందేశాలు పంపే పొరపాటు చేయకండి. దానిపై ఫిర్యాదు అందితే వాట్సాప్ మీ ఖాతాపై చర్య తీసుకోవచ్చు.
మరిన్ని వెబ్ స్టోరీస్
మీ ఆధార్ దుర్వినియోగం అయిందని సందేహమా? ఇలా తెలుసుకోండి..
ఫాస్టాగ్ వాడుతున్నారా.? ఈ టెక్నాలజీతో మీ మనీ సేవ్..
రోజుకో రకమైన నగలు ధరిస్తే.. గ్రహ దోషాలన్నీ ఫసక్..