ఈ లక్షణాలున్నాయా.? మీకు 'హెల్త్ యాంగ్జైట
ీ' ఉన్నట్లే..
25 September 20
23
ఆరోగ్యం గురించి అతిగా ఆలోచించే సమస్యను 'హెల్త్ యాంగ్జైటీ' అంటారు. దీనిని నిపుణులు ఒక మానసిక సమస్యగా చెబుతున్నారు.
కొన్ని లక్షణాల ద్వారా ఈ హెల్త్ యాంగ్జైటీని కనిపెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ప్రధానమైంది నిత్యం ఆరోగ్యం
గురించి ఆందోళన చెందడం.
శరీరంలో ఏ చిన్న మార్పు కనింపించినా వెంటనే అనారోగ్య సంకేతాల కోసం సెర్చ్ చేస్తారు. ఎక్కడ నొప్పిగా ఉన్నా, ఏ చిన్న వాప
ు కనిపించినా భయపడిపోతుంటారు.
ఒంట్లో కాస్త నలతగా ఉన్నా కంగారు పడిపోతుంటారు. పక్కవారితో పోల్చుతూ నాకేమైనా సమస్య ఉందా, ఇలా ఎందుకు జరుగుతుంది అన్న భ
ావనలో ఉంటారు.
వైద్యుడి దగ్గరికి వెళ్లినా తృప్తి చెందరు. డాక్టర్ ఎంత వరకు నిజం చెప్పాడో లేదో అసలు వ్యాధిని సరిగ్గా గుర్తించాడో లే
దో అన్న ఆలోచనల్లో ఉంటారు.
ఆరోగ్యం విషయంలో నిత్యం ఏదో ఒక అనుమానంతో ఉంటారు. యూట్యూబ్‌లో రకరకాల సమస్యలను సెర్చ్ చేస్తూ తమకుతాము ఆపాదించుకుంటారు
.
కొందరు నిత్యం అనారోగ్యంతో ఉన్న భావనలోనే ఉంటారు. శారీరకంగా ఎలాంటి పని చేయకుండా నిత్యం విశ్రాంతి తీసుకోవాలనే ఆలోచనలోన
ే ఉంటారు.
నిత్యం ఏదో జరుగుతోందన్న ఆలోచనలో ఉండడం. గుండెలో దడగా ఉండడం, ఆందోళన, ఒత్తిడితో, గుండె వేగం పెరగడం వంటి లక్షణాలు కనిపి
స్తాయి.
ఇక్కడ క్లిక్ చేయండి..