గోళ్లు కొరకే అలవాటు ఉంటే.. అనారోగ్యానికి రెడ్ కార్పెట్ వేసినట్టే.. 

Prudvi Battula 

01 September 2025

ఏమీ తోచనప్పుడో, దేన్నయినా నిశితంగా గమనిస్తున్నప్పుడో, భయపడినప్పుడతో తెలిసో తెలియకో కొందరు గోళ్లు కొరకటం చూస్తూనే ఉంటాం. ఎప్పుడో అప్పుడంటే ఏమో గానీ ఇదొక అలవాటుగా, విడవలేని ప్రవర్తనగా మారితే కష్టమే

దీన్నే అనికోఫేజీ లేదా అనికోఫేజియా అంటారు. ఇది తరచూ చూసే సమస్యే. దీన్ని తేలికగా తీసుకోవటానికి లేదు. ఎందుకంటే వదులుకోవటం చాలా చాలా కష్టం. మితిమీరితే ఇతరత్రా ఇబ్బందులకూ దారితీస్తుంది

గోళ్లు కొరకటం సాధారణంగా బాల్యంలో.. మూడేళ్ల వయసులోనే మొదలవుతుంటుంది. పిల్లల్లో సుమారు 20% మంది అదేపనిగా గోళ్లు కొరుకుతుంటారని అంచనా

గోళ్లు కొరకడం వల్ల పెద్దపేగు క్యాన్సర్ కూడా వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గోళ్లు కొరకడం ద్వారా అనేక రకాల బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుందని వైద్యులు చెబుతున్నారు

గోరు లోపల ఉండే బాక్టీరియా శరీరంలోకి ప్రవేశించడం వల్ల రకరకాల పొట్ట సమస్యలు వస్తాయి. ఇది మీ జీర్ణవ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది

కాలక్రమేణా పెద్దప్రేగు క్యాన్సర్‌కు దారితీయవచ్చు. గోళ్లను కొరకడం వల్ల గోళ్లలోని మురికి నోటిలో చేరి జలుబు, ఇతర అంటువ్యాధులు వస్తాయి

గోరు కొరకడం వల్ల గోరు చుట్టూ ఉన్న చర్మం పొడిబారడంతోపాటు పొరలుగా మారుతుంది. కాబట్టి వీలైనంత వరకు మీ గోళ్లను నోటికి దూరంగా ఉంచాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు

నోట్లో బోలెడన్ని బాక్టీరియా, వైరస్‌లుంటాయి. ఇవి లాలాలజం ద్వారా వేలి కొసలకు, గోరు అడుగు భాగానికి చేరుకుంటాయి. వేళ్లు అదేపనిగా తడిగా ఉండటం వల్ల బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లే కాదు, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లూ తలెత్తొచ్చు.