ఇలా క్లీన్ చేస్తే.. మీ స్టవ్ కొత్త దానిలా మెరిసిపోతుంది..

22 August 2025

Prudvi Battula 

గ్యాస్‌ పొయ్యిని శుభ్రపరచడం చాలా కష్టమైన పని. స్టౌపై పేరుకుపోయిన నూనె, మురికి అంతత్వరగా వదలవు. దీని కోసం చాలా కష్టపడాలి.

ఇలా స్టవ్‌పై పేరుకున్న జిడ్డు, ఇతర పదార్థాల అవశేషాలు సులభంగా పోవాలంటే ఇంట్లో లభించే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలు ఉపయోగపడతాయి.

స్టవ్ గ్యాస్ బర్నర్స్ కూడా జిడ్డుతో నిండిపోతాయి. గ్యాస్ ఓవెన్ సరిగ్గా శుభ్రం చేయకపోతే, మంట బయటకు రాదు.

అందుకే వారానికి ఒక రోజు ప్రత్యేకంగా దీనిని శుభ్రం చేయాలి. గ్యాస్ బర్నర్లను సాధారణంగా డిష్ సబ్బుతో శుభ్రం చేస్తుంటాం.

కానీ ఇలా చేసే కంటే.. కొన్ని ఉల్లిపాయ ముక్కలను వేడి నీటిలో వేసి బాగా మరిగించాలి. ఈ మిశ్రమం చల్లారాక, స్పాంజ్‌ను అందులో ముంచి గ్యాస్ ఓవెన్‌ను బాగా తుడిస్తేసరి

గ్యాస్ బర్నర్ లోపల వెనిగర్ చుక్కలు వేసి, కాసేపు అలాగే వదిలేయాలి. తర్వాత డిష్‌ వాష్‌ వేసుకుని స్పాంజితో తోమితే అన్ని జిడ్డు మరకలు తొలగిపోతాయి

బేకింగ్ సోడాతో నిమ్మరసం లేదా వెనిగర్ కలుపుకోవాలి. ఈ మిశ్రమంతో వారానికి ఒకసారి గ్యాస్ ఓవెన్, బర్నర్‌ను శుభ్రం చేస్తే తళతళలాడిపోతాయి

నీటిని బాగా మరిగించి స్టవ్ కుక్‌టాప్‌పై పోయాలి. ఇలా పోసిన నీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత కాస్త డిష్‌వాషర్ లేదా ఏదైనా సోప్ వేసి స్క్రబ్బర్‌తో తోమితే సరి.. స్టవ్‌పై పేరుకుపోయిన జిడ్డు ఇట్టే వదిలిపోతుంది

వేడి నీటిలో ఉప్పు వేసి, దానిలో బర్నర్లను ముంచి 15-20 నిమిషాలు ఉడకబెట్టాలి. తర్వాత సబ్బుతో కడగాలి. ఈ చిట్కాలు ట్రై చేసి చూడండి.. మీ కళ్లను మీరే నమ్మలేరు