జామపండ్లు మీ డైట్‎లో ఉంటే.. డాక్టర్‎తో పనేంటి.?

30 July 2025

Prudvi Battula 

జామ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. సాధారణ జలుబు, ఇతర ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది.

జామ పండ్లలోని ఫైబర్, ఇతర సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉపయోగకరంగా ఉంటుంది.

జామ పండ్లలోని పొటాషియం, ఫైబర్ రక్తపోటును తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి.

జామ పండ్లలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.

జామ పండ్లలోని ఫైబర్ మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచడం ద్వారా త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

జామ పండ్లలోని యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ముడతలను తగ్గించి వృద్ధాప్యాన్ని నెమ్మదిస్తుంది.

జామలో సమృద్ధిగా ఉండే మాంగనీస్, ఆహారం నుంచి ఇతర ముఖ్యమైన పోషకాలను శరీరం బాగా గ్రహించేందుకు సహాయపడుతుంది.

జామ పండులో పుష్కలంగా లభించే ఫోలేట్ అనే ఖనిజం స్త్రీ గర్భధారణ సమయంలో శిశివు ఆరోగ్యంగా జన్మించడానికి సహాయపడుతుంది.