బీపీ ని కంట్రోల్ చెయ్యడం ఎలా..? తెలుసుకుందాం..

కొన్ని నీళ్ళలో రెండు చెంచాల మెంతుల్ని వేసి మరిగించాలి. అవి చల్లారాక వడకట్టి తీసుకోవాలి.

మెంతుల్లో అధికంగా ఉండే పొటాషియం, ఫైబర్‌... వంటివి అధిక రక్తపోటు నుంచి త్వరిత ఉపశమనంలో తోడ్పడతాయి.

తేనె కూడా అధిక రక్తపోటు నుంచి విముక్తి కలిగించడంలో దోహదం చేస్తుంది.

ఇందుకోసం రోజూ పరగడువున రెండు చెంచాల తేనె తీసుకోవడం మంచిది.

అలాగే తులసి రసం, తేనె సమపాళ్లలో కలిపిన మిశ్రమాన్ని కూడా ప్రయత్నించచ్చు.

రోజుకు రెండు అరటివండ్లు తినడం, అల్లాన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం..

కూరల్లో ఉప్పు తగ్గించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం..

ఇలాంటి వంటివన్నీ అధిక రక్తపోటును తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయి.