ఫ్రిజ్‌తో పనిలేదు.. ఇలా నిల్వ చేస్తే.. పచ్చిమిర్చి వారమైనా ఫ్రెష్‌గా ఉంటాయి!
24 May 2026
Anand T
ఇంట్లో ప్రిజ్ ఉన్నవారు అయితే వాటిని ఫ్రిజ్‌లో స్టోర్ చేసి ఎక్కువ రోజులు వాడుతారు. కానీ ఇంట్లో ఫ్రిజ్ లేని వారు పచ్చిమిర్చిని ఎక్కువగా రోజులు ఎలా నిల్వ చేయాలి. అలాంటి వారికోసం కొన్ని చిట్కాలు
పచ్చి మిరపకాయలు పాడైపోవడానికి ప్రధాన కారణం వాటి కాడ. కాబట్టి, మిరపకాయలను కొన్న వెంటనే వాటి కాడను తొలగించండి.
పచ్చిమిర్చిని శుభ్రంగా కగిడిన తర్వాత వాటిని పొడి క్లాత్‌తో తుడవడం లేదా గాలికి ఆరబెట్టడం చాలా ముఖ్యం. లేదంటే వాటికి ఉండే తేమ కారణంగా అవి కుళ్లిపోతాయి.
మిరపకాయలను జిప్‌లాక్ బ్యాగ్ లేదా గాలి చొరబడని డబ్బాలో ఉంచి, ఫాయిల్‌తో కప్పి, సీల్ చేయండి. ఇలా చేయడం ద్వారా అవి ఎక్కవ రోజులు నిల్వ ఉంటాయి.
మరొక ఎంపిక పసుపు పొడి. పచ్చిమిరపకాయలను కడిగి ఆరబెట్టిన తర్వాత, వాటిని ఒక గిన్నెలో వేసి, వాటిపై కొద్దిగా పసుపు పొడి చల్లి బాగా కలపండి.
ఇలా చేయడం వల్ల మిరపకాయలపై ఉండే బ్యాక్టీరియా నశించి, అవి ఎక్కువ కాలం తాజాగా ఉండటానికి సహాయపడుతుంది.
అదనంగా, మిరపకాయలు వాడిపోకుండా ఉండటానికి వాటికి కొద్దిగా కొబ్బరి నూనె లేదా పొద్దుతిరుగుడు నూనెను పూయవచ్చు. ఇవి వాటిని త్వరగా పాడవకుండా సహాయపడుతాయి.
పైన చెప్పిన చిట్కాలను పాటించడం ద్వారా మీరు పచ్చిమిరపకాయలను ఎక్కువ రోజులు వాడుకోవచ్చు. దీని వల్ల మీకు ఖర్చులు కూడా తగ్గుతాయి.