చేతి గోళ్లను అందంగా పెంచి, రంగురంగుల నెయిల్ పాలిష్ వేసి మురిసిపోతుంటారు మగువలు. కానీ కొందరికి ఇంట్లో పనులు, విటమిన్స్ లోపం వల్ల తరచూ విరిగిపోతుంటాయి
TV9 Telugu
అందుకే తరచూ పార్లర్‌కి వెళ్లి మాలిక్యూర్ చేయించుకుంటూ ఉంటారు. అయితే ప్రతిసారి పార్లర్‌కి వెళ్లడానికి సమయం ఉండదు. ఇలాంటప్పుడు ఇంట్లోనే చేతులను అందంగా తీర్చిదిద్దుకుని, మెరిపించేయొచ్చు
TV9 Telugu
స్టైలిష్‌గా గోళ్లను పెంచాలంటే ముందు వాటి ఆకృతికి తగ్గట్టు కత్తిరించుకోవాలి. ముందుగా ఫైల్‌తో రుద్ది, ఆ తర్వాత ఏదైనా హ్యాడ్ క్రీమ్‌ను అప్లై చేసి శుభ్రం చేసుకోవాలి
TV9 Telugu
ఇప్పుడు ఓ పెద్ద గిన్నెలో గోరువెచ్చని నీటిని తీసుకుని, అందులో 1 టీస్పూన్ షాంపూ మిక్స్ చేసి ఆ నీటిలో చేతులను పది నిమిషాల పాటు ముంచాలి. అనంతరం నెయిల్ స్టోన్ సహాయంతో గోరు క్యూటికల్స్ పైకి నెట్టాలి
TV9 Telugu
అదనపు క్యూటికల్‌లను జాగ్రత్తగా కత్తిరించుకోవాలి. ఆ తరువాత, మీ చేతులను బాగా తుడిచి, గోళ్లపై స్పష్టమైన బేస్ కోట్ వేయాలి. నెయిల్ పాలిష్ ధరించకూడదనుకుంటే, బేస్ కోటు మాత్రమే వేసుకుంటే సరిపోతుంది
TV9 Telugu
బేస్ కోట్ ఆరిన తర్వాత, నచ్చిన నెయిల్ పాలిష్‌ను వేసుకోవాలి. నెయిల్ పాలిష్ వేసేటప్పుడు కొందరికి గోరు చుట్టూ నెయిల్ పాలిష్ అంటుకుంటుంది. దీనిని డ్రై రిమూవర్‌తో శుభ్రం చేసుకోవాలి
TV9 Telugu
నెయిల్ పాలిష్ కోట్ ఆరిపోయిన తర్వాత, మీరు దానిపై మరొక క్లియర్ బేస్ కోట్ వేయవచ్చు. ఇది నెయిల్ పాలిష్‌ని ఎక్కువ కాలం ఉండేలా చేస్తుంది
TV9 Telugu
చాలా మంది గోళ్ల అంచులలో క్యూటికల్స్ ఎండిపోయి గట్టిపడతాయి. డెడ్ స్కిన్ బయటకు వస్తుంది. కాబట్టి చివరగా గోరు నాలుగు అంచులకు క్యూటికల్ ఆయిల్ రాసి ఆరబెడితే సరిపోతుంది