మీ చర్మ తత్వానికి ఏ విధమైన సీరం వాడాలో తెలుసా?

17 October 2024

TV9 Telugu

TV9 Telugu

ముఖంపైన చిన్న మచ్చ కూడా ఉండకూడదనే కోరుకుంటుంది ఏ అమ్మాయైనా. ఏ వయసులోనైనా మేలిమి ఛాయతో మెరిసిపోవాలనుకుంటూ అందాన్ని పెంచుకోవడానికి ఎన్నెన్నో సౌందర్యోత్పత్తులూ వాడేస్తుంటారు

TV9 Telugu

అందుకోసం మార్కెట్లో దొరికే బోలెడన్ని క్రీములూ, లోషన్లు వాడేస్తుంటారు. ఈమధ్య వాటన్నింటినీ పక్కనపెడుతూ రకరకాల సీరమ్స్‌ వస్తున్నాయి. అందానికి సంబంధించిన చర్మ సమస్యలేవైనా సీరమ్‌ మంచి సొల్యూషన్‌గా మారింది

TV9 Telugu

అందం పోషణకు రకరకాల సీరంలు అందుబాటులోకి వచ్చాయి. అయితే మీ చర్మానికి ఏవిధమైన సీరం వాడాలి? అని ఆలోచిస్తున్నారా.. మీ సందేహాలకు మేము సరైన సమాధానం ఇస్తాం

TV9 Telugu

తగినంత తేమ లేకపోవడం వల్ల చర్మం పొడిగామారి, గరుకుగా మారుతుంది. కాబట్టి హైలురోనిక్ యాసిడ్, గ్లిజరిన్ కలిగిన సీరమ్‌లు ఈ రకమైన చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. హైలురోనిక్ యాసిడ్ చర్మంలో ముడతలను నివారిస్తుంది

TV9 Telugu

జిడ్డులేని అందమైన చర్మం అందరికీ ఉండదు. ఈ రకమైన చర్మం ఉన్నవారికి ఏడాది పొడవునా ముఖం మృదువుగా ఉంటుంది. కానీ జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ చర్మం కూడా దెబ్బతింటుంది

TV9 Telugu

చర్మం పొడిబారడం, కరుకుదనాన్ని నివారించడానికి అన్ని చర్మ రకాలకు సరిపోయే సీరమ్‌లను ఎంచుకోవచ్చు. సాధారణంగా, ఈ రకమైన చర్మానికి విటమిన్ సి, రెటినోల్ అధికంగా ఉండే సీరం ఎంచుకోవాలి

TV9 Telugu

మొటిమల బారిన పడే చర్మతత్వం కలిగిన వారిలో బాధపడేవారిలో ఓపెన్ రంద్రాలు ప్రధాన సమస్యగా ఉంటుంది. రంధ్రాలను మూసివేయడానికి చర్మానికి అనుకూలమైన సీరం అవసరం. ఇలాంటి వారు సాలిసిలిక్ యాసిడ్ అధికంగా ఉండే సీరమ్‌లు ఉపయోగించవచ్చు

TV9 Telugu

మొటిమలు, ముడతలు, మచ్చలు వంటి సాధారణ చర్మ సమస్యలు నివారించడానికి నియాసినామైడ్, అర్బుటిన్, విటమిన్ సి వంటి ప్రయోజనకరమైన పదార్థాలు ఉన్న సీరమ్‌లను ఉపయోగించాలి. కాబట్టి సీరం కొనుగోలు చేసే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి