సాధారణంగా గర్భిణీల్లో జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని తెలిసిందే. అయితే కుంకుమ పువ్వును తీసుకుంటే మలబద్ధకం సమస్య దూరమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
గర్భందాల్చిన వాళ్లలో వేవిళ్ల సమస్య రావడం సర్వసాధారణం. కుంకుమ పువ్వును తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఇక గర్భందాల్చిన వారిలో మూడ్ స్వింగ్స్, యాంగ్జైటీ, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు కూడా కామన్. అయితే కుంకుమ పువ్వును పాలలో కలుపుకొని తాగడం వల్ల ఈ సమస్యలన్నింటి నుంచి బయటపడొచ్చు.
కొందరు గర్భిణుల్లో రక్తహీనత సమస్య ఉంటుంది. అలాంటి వారు ఐరన్ సప్లిమెంట్లను తీసుకోవాలి. కుంకుమ పువ్వులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతకు చెక్ పెట్టొచ్చు.
గర్భిణుల్లో బీపీ అదుపులో ఉండాలంటే కుంకుమ పువ్వును రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీంతో బీపీ కంట్రోల్‌లో ఉంటుంది.
రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా కుంకుమ పువ్వు కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో అలర్జీలు, ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా ఉంటాయి.
గర్భిణీల్లో జుట్టు రాలడం సమస్య కూడా ఎదురవుతుంటుంది. అలాంటి వాళ్లు కుంకుమ పువ్వు తీసుకుంటే జుట్టు రాలడం ఆగిపోతుంది, జుట్ట దృఢంగా మారుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించమే ఉత్తమం.