ఆలుగడ్డ తొక్కేకదా అని పడేస్తున్నారా?

19 September 2024

TV9 Telugu

బంగాళదుంప తొక్కలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా అనేక ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయి.

ఇంట్లో పెంచుకునే మొక్కల కోసం వాడే సహజ ఎరువులను కంపోస్ట్‌ను వాడుతున్నట్లయితే వాటిలో బంగాళదుంప తొక్కలను యాడ్ చేసుకోవాలి.

ఈ ఆలు తొక్కలలో నత్రజని, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయని.. ఇవి మొక్కలకు మంచి ఎరువుగా ఉపయోగపడతాయని వివరిస్తున్నారు.

వెండి, తుప్పు పట్టిన పాత్రలను రుద్ది కడిగితే మిలమిలా మెరుస్తాయి. తొక్క లోపలి భాగాన్ని షూలపై రుద్దడం వల్ల మురికి పోయి నీట్​గా మారతాయి.

బంగాళదుంప తొక్కను చర్మంపై రుద్దడం వల్ల ముఖంపై దురద, దద్దుర్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. నల్ల మచ్చలను తొలగించడంలోనూ సాయపడుతుంది.

తొక్కలను కాల్చి వాటిపై మసాలా చల్లుకుని క్రిస్పీ చిప్స్​గా తినవచ్చట. వీటిలోని ఫైబర్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

తొక్కలోని ఆమ్ల గుణాలు క్లీనింగ్‌ ఏజెంట్‌గా, క్రిమి సంహారిణిగా పనిచేస్తాయి. ఇందులోని ఐరన్ రక్తహీనతను నివారిస్తుంది.

తెలుసుకున్నారుగా ఇప్పట్టినుంచి బంగాళాదుంప నుంచి తొలగించిన తొక్కలను పడేయకుండా మీరు కూడా వీటి కోసం ఉపయోగించండి.