చలికాలంలో ఆరోగ్యానికి రెట్టింపు మేలు చేసే పోషకాల ‘మఖానా’..!

04 November 2024

TV9 Telugu

TV9 Telugu

తెల్లతెల్లటి బంతుల్లా కాస్త అటూఇటూగా పాప్‌కార్న్‌లా కనిపించే ఈ మఖానా- వట్టి కాలక్షేపానికే కాదు, సూపర్‌ఫుడ్‌గానూ పన పనికి వస్తుందని నిపుణుల చెబుతున్నారు

TV9 Telugu

డ్రై ఫ్రూట్స్‌కి సమానంగా పోషకాలతో ఏమాత్రం తీసిపోని నట్‌గా పేరుతెచ్చుకున్న ఈ ఫూల్‌ మఖానా రకరకాల రుచుల్లో కలిసిపోయింది. చెరువులూ, బురద నీటి గుంటల్లో అందంగా విరిసే తామర పూల నుంచే వస్తాయీ మఖానా

TV9 Telugu

అయితే ‘మఖానా’గా పిలుచుకునే ఈ తామర గింజల్లో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఈ గింజలు రోజూ ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యానికెంతో మేలని నిపుణులు చెబుతున్నారు

TV9 Telugu

దీంతో మఖానా కూడా డ్రై ఫ్రూట్ లిస్ట్ చేరిపోయింది. ఈ తామర గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి వివిధ ఆరోగ్య సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి

TV9 Telugu

ముఖ్యంగా చలికాలంలో మఖానా రోజూ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. మఖానాలో పొటాషియం, సోడియం, ఫాస్పరస్, కాల్షియం, ఫైబర్, ఐరన్, విటమిన్ బి1 లభిస్తాయి

TV9 Telugu

మఖానాలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మఖానాలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది మెగ్నీషియం రక్తపోటు, గుండె కొట్టుకోవడం నియంత్రణలో సహాయపడుతుంది

TV9 Telugu

మఖానాలో తక్కువగా కొవ్వు, కేలరీల సంఖ్య ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి మఖానా చాలా మంచి ఎంపిక. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక వ్యక్తి రోజుకు 10 నుండి 15 గ్రాముల మఖానా మాత్రమే తినాలి. అంతకు మించి తీసుకుంటే ఇబ్బంది కలగవచ్చు

TV9 Telugu

కేవలం ఆరోగ్యాన్నే కాదు.. మఖానాతో చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చు. వీటిని క్రమంగా తీసుకోవడం వల్ల ముఖంపై మొటిమలు, ముడతలు రాకుండా ఉంటాయి. అలర్జీ, గ్యాస్ట్రిక్‌ సమస్యలు, కడుపుబ్బరంతో బాధపడే వీటిని దూరం పెట్టడమే మేలు