19 September 2023

అరిటాకు భోజనం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా !!

Pic credit - Instagram

అరిటాకులో భోజనం చేయడం మన హిందూ సాంప్రదాయాల్లో ఒకటి.. అరిటాకులో తినటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం

అరిటాకు లో వేడి ఆహారాన్ని పెట్టడం వల్ల అరిటాకుకు సహజంగా  ఉండే సువాసన పదార్ధానికి పట్టుకుని మరింత రుచిగా ఉండేలా చేస్తుంది.

అరిటాకులో యాంటీ మైక్రోబియల్‌ ఉండటంవల్ల ఆహారంలో ఏమైనా సూక్ష్మజీవులు ఉన్నా అవి సహజంగా తొలగిపోతాయి. అందువల్ల ఆహార సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి.

విటమిన్‌ ఏ, విటమిన్‌ సీ వంటి అనేక పోషకాలు అరిటాకులో ఉండటం వల్ల మనం తినే ఆహారంలోకి ఇవి బదిలీ అయ్యి ఆహరంలోని పోషకాలు మరింత వృద్ధి చెందుతాయి.

అరిటాకులో భోజనం చేయడం వల్ల పర్యావరణానికీ మంచి జరుగుతుంది. ఇవి నేలపై పారేసినా తేలికగా భూమిలో కలిసిపోతాయి. తద్వారా  మట్టి మరింత సారవంతంగా  మారుతుంది.

అరిటాకు లో అన్నం తినడం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. ఆకులో ఉండే పాలీఫెనాళ్లు పొట్టలో జీవ రసాలను తగిన స్థాయిలో విడుదలయ్యేలా చూస్తాయి. 

 భోజనం చేసే ముందు ఆకుని నీటితో కడగడం వల్ల  ఆకులపై దుమ్ము రేణువులు తొలగిపోయి భోజనం రుచి కూడా పెరుగుతుంది. తిన్నాక మనకు తృప్తిగా ఉంటుంది.