ఈ నీరు అమృతం కన్నా ఎక్కువే.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగారంటే..

02 April 2024

Shaik Madar Saheb

బార్లీలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి. బార్లీ గింజల్లోని పోషకాలు ఎన్నో సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తాయి.

అందుకే బార్లీ నీటిని పేదల సంజీవనిగా పేర్కొంటారు. రెగ్యులర్‌గా బార్లీ నీటిని తాగితే.. శరీరానికి ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి.

డయాబెటిస్‌కు చాలా మంచిది.. బార్లీ నీరు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి, నియంత్రించడానికి సహాయపడుతుంది. 

ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. హృదయనాళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఇందులో చాలా ఫైబర్ ఉంటుంది. బార్లీ నీటిని వడకట్టకుండా తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. 

ఇది శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది.

బార్లీ గింజలను తీసుకోని ఉడకబెట్టిన తర్వాత, ఆ నీటిని ఫిల్టర్ చేసి తాగాలి. రుచిని జోడించడానికి నిమ్మరసాన్ని కూడా జోడించవచ్చు..

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కి అద్భుతమైనది. ఈ నీటిని తాగితే మూత్రాశయ సమస్యలకు దూరం చేసి.. ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

చర్మానికి చాలా మంచిది బార్లీ నీరు.. ఆరోగ్యవంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.