వర్షాకాలంలో జుట్టు అధికంగా రాలుతుందా ?? ఎందుకో తెలుసా ??
వానాకాలంలో చాలామందిలో జుట్టు సమస్యలు వస్తూ ఉంటాయి.
వాతావరణంలో తేమ పెరగడం కారణంగా జుట్టుపై ప్రభావం పడి ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
దీని కారణంగా చాలామందిలో జుట్టు రాలడం, జుట్టులో దుమ్ము ధూళి పేరుకుపోవడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి.
వానాకాలంలో జుట్టు రాలడం, స్కాల్ప్ ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు తప్పకుండా జుట్టును సంరక్షించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వర్షంలో నుంచి వచ్చిన వెంటనే జుట్టును కాటన్ తో తుడుచుకోవాల్సి ఉంటుంది.
నూనెను అప్లై చేసి ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసి తల స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు సమస్యలు రాకుండా ఉంటాయి.
రసాయనాలతో కూడిన షాంపూలకు బదులుగా సాధారణ షాంపులను వినియోగించడం చాలా మంచిది.
వానాకాలంలో హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అతిగా వినియోగిస్తూ ఉంటారు. ఇందులో ఉండే రసాయనాల ప్రభావం జుట్టుపై పడి రాలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.
వర్షాకాలంలో జుట్టును ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు తప్పకుండా తీసుకోవాలి.
ఇక్కడ క్లిక్ చేయండి