మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కంటినిండా నిద్ర, సమతుల్య ఆహారం ఎంతో అవసరం. అందువల్ల ఈ ఆహార పదార్ధాలతో నిద్రలేమి సమస్యను నియంత్రణ చేయవచ్చు.
చెర్రీస్ తినడం వల్ల నాణ్యమైన నిద్ర వస్తుంది. చెర్రీస్ తినడం వల్ల నిద్ర హార్మోన్ మెలటోనిన్‌ను ప్రోత్సహిస్తుంది. దీని వల్ల మంచి నిద్రపడుతుంది.
అరటిపండులో ఉండే ట్రిప్టోఫాన్, విటమిన్ B6 సెరోటోనిన్, మెలటోనిన్‌లను ప్రోత్సహిస్తుంది. అందు వల్ల ప్రతి రోజు అరటిపండు తినడం వల్ల నిద్రలేమి సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.
ప్రతి రోజు క్రమం తప్పకుండ 5-6 బాదంపప్పు తినడం వల్ల నిద్రలేమి సమస్య నుండి తొందరగా బయటపడవచ్చు. బాదం లో మెలటోనిన్, మినరల్ మెగ్నీషియం వంటివి అనేక పోషకాలు ఉంటాయి
రిచ్ ఫ్యాటీ ఫిష్‌లో ఐరన్, జింక్, విటమిన్ బి12 ఇంకా కోలిన్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.
ఓట్స్‌లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఫైబర్ ఉంటాయి. ఇవి రక్తం లో చెక్కెర స్థాయి నియంత్రించి రాత్రంతా ప్రశాంతంగా నిద్రపట్టేలా ప్రోత్సహిస్తాయి.
ఓట్స్‌లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఫైబర్ ఉంటాయి. ఇవి రక్తం లో చెక్కెర స్థాయి నియంత్రించి రాత్రంతా ప్రశాంతంగా నిద్రపట్టేలా ప్రోత్సహిస్తాయి.
చమోమిలే పువ్వు నుండి హెర్బల్ టీ తయారు చేస్తారు.. వీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.. ఇది ఒత్తిడి తగ్గించి నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది.