గ్యాస్ సమస్య దూరం కావాలంటే కీర దోసకాయను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని వాటర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
అరటి పండు కూడా గ్యాస్ సమస్యను దూరం చేస్తుంది. ఇందులోని క్యాల్షియం, ఫైబర్ కంటెంట్‌తో అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు దూరమవుతాయని నిపుణ/లు చెబుతున్నారు.
కొబ్బరి నీటిని తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్య దూరమవుతుంది. వీటితో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్ సమస్య సైతం పరార్ అవుతుంది.
నిమ్మకాయ రసం కూడా జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. ఉదయాన్నే పడగడుపున తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడి, గ్యాస్ సమస్య దూరమవుతుంది.
ప్రతీ ఒక్కరి వంటింట్లో కచ్చితంగా ఉండే జీలకర్ర కూడా గ్యాస్ సమస్యను దూరం చేస్తుంది. రాత్రంతా నానబెట్టిన జీలకర్ర నీటిని ఉదయాన్నే తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
ఇక తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఒకేసారి ఎక్కువగా కాకుండా కొంచెం కొంచెం తింటే గ్యాస్ సమస్య దూరమవుతుంది.
గ్యాస్ సమస్యతో బాధపడుతున్న వారు కొన్ని రోజుల పాటు నాన్‌వెజ్‌కు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్‌ను తీసుకోవాలి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.