కిడ్నీల పనితీరు తగ్గినప్పుడు విపరీతమైన అలసట, ఏ పనిపై శ్రద్ధలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనికి కారణంగా రక్తహీనత రావడమే.
టాక్సిన్స్‌ను సరిగ్గా ఫిల్టర్ చేయకపోతే అవి రక్తంలో పేరుకుపోయి నిద్రపై ప్రభావం చూపుతుంది. కాబట్టి నిద్రలేమి కూడా కిడ్నీలు పాడయ్యయాని చెప్పడానికి ఒక లక్షణం.
కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే.. చర్మంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీంతో చర్మం పొడిబారడం, దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి.
తరచుగా మూత్ర విసర్జన సమస్య వేధిస్తున్నా కిడ్నీల పనితీరు దెబ్బతిన్నట్లేనని అర్థం చేసుకోవాలి. కిడ్నీల వడపోత పనితీరు తగ్గితే తరచుగా మూతవిసర్జన చేయాల్సి వస్తుంది.
కిడ్నీలో ఫిల్టరింగ్ ప్రక్రియకు ఆటంకం ఏర్పడినప్పుడు, మూత్రం ద్వారా రక్త కణాలు కూడా లీక్ అవుతాయి. అందుకే మూత్రంలో రక్తం పడుతుంది.
నురుగుతో కూడిన మూత్రం వచ్చినా కిడ్నీల పనితీరు దెబ్బతిన్నట్లే అర్థం చేసుకోవాలి. ఈ లక్షణం కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి
కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే ప్రోటీన్‌ను ఎక్కువగా విసర్జించాల్సి ఉంటుంది. దీంతో కళ్లు ఉబ్బినట్లు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణం కనిపించినా అది కిడ్నీలు పాడయ్యాయి అనడానికి లక్షణాలు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.