డయాబెటిస్ ను అదుపులో ఉంచే అద్భుతమైన డ్రై ఫ్రూట్స్
Phani CH
14 SEp 2024
ప్రస్తుతం లైఫ్ స్టైల్ వల్ల యువతలోనే ఎక్కువ మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి.
డయాబెటిస్ సమస్య ఉన్న వారు ఎక్కువగా వ్యాయామం చేయాలి.. అంతే కాకుండా ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
అయితే కొన్ని రకాల డ్రై ఫూట్స్‌ను తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను అదుపులో ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
డ్రై ఫ్రూట్స్ మొదటిది అంజీర్. దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల షుగర్ లెవెల్స్‌ను అదుపులో ఉంచటానికి ఎంతగానో సహాయపడుతుంది.
బాదం లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది ఇన్సులిన్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తం లో చెక్కెర స్థాయి తగ్గిస్తుంది.
వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా సహాయపడతాయి.
పిస్తాలో ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడతాయి. షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
ఇక్కడ క్లిక్ చేయండి