కాఫీ ఎక్కువగా తాగుతున్నారా.? ఆ సమస్యలతో స్నేహం చేసినట్టే.. 

17 August 2025

Prudvi Battula 

కప్పు కాఫీ తాగనిదే చాలామందికి రోజు మొదలు కాదు. పని ఒత్తిడి తగ్గించుకోవడానికి.. బద్ధకాన్ని వదిలించుకోవడానికి..తలనొప్పి నుంచి ఉపశమనం పొందడానికి..ఇలా వివిధ కారణాలతో కాఫీని ఆశ్రయిస్తుంటారు

అయితే కాఫీ ఎక్కువగా తాగడం వల్ల ఇందులోని కెఫీన్‌ మన శరీరానికి హాని కలగజేస్తుంది. శరీరం డీహైడ్రేట్ అవుతుంది. నిద్ర సమస్యలు కూడా వస్తాయి. ఒత్తిడి హార్మోన్ల స్రావాన్ని పెంచుతుంది

అలాగే అధికంగా కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి మాత్రమే కాదు వృద్ధాప్యం కూడా ముందుగానే ముంచుకొస్తుందట. కాఫీలోని యాసిడ్ శరీరంలో హార్మోన్ల అసమతుల్యతను కలిగిస్తుంది

దీని వల్ల సెబమ్ ఉత్పత్తి పెరిగి చర్మం జిడ్డుగా మారుతుంది. సాధ్యమైనంతవరకు చక్కెరతో పాటు ఎలాంటి ఆర్టిఫిషియల్‌ స్వీటెనర్స్‌ కలుపుకోకూడదు

పాలు, పంచదార కలిపి కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ మొటిమలతో ముఖం నింపుతుంది. కాఫీ ఎక్కువగా తాగడం వల్ల మొటిమలు వస్తాయి

కాఫీ తాగడం వల్ల చర్మం జిడ్డుగా మారడమే కాదు శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. కెఫిన్‌తో కూడిన పానీయాలు ఎక్కువగా తాగడం వల్ల చర్మం ఇన్‌ఫ్లమేషన్‌కు గురవుతుంది

కాఫీ తయారుచేసేటప్పుడు చిటికెడు యాలకుల పొడిని కలపడం వల్ల కాఫీ వల్ల కలిగే ఎసిడిటీని తగ్గించవచ్చు. స్పైసీ, ఫ్రైడ్‌ ఫుడ్స్ తిన్న తర్వాత కాఫీ తీసుకోకూడదు. ఆ అలవాట్లు చర్మాన్ని డ్యామేజ్‌ చేస్తాయి

అందుకే రోజుకు 400 mg కంటే ఎక్కువ కాఫీ పొడిని ఉపయోగించకూడదు. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రోజుకు 2-3 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగకూడదు