ఒక్కరే సంతానం సమస్యలకు దారి తీస్తుందా?
TV9 Telugu
02 October 2024
ప్రస్తుతం చాలామంది దంపతులు ఒకరు సంతానం చాలనుకొంటున్నారు. అయితే దీని కారణంగా సమస్యలు రావచ్చని చాలామంది భావిస్తున్నారు.
తల్లిదండ్రులకు ఒక్కరే సంతానమైతే గారాబం ఎక్కువై అది అనేక ఇతర సమస్యలకు దారితీస్తుందనే అభిప్రాయం సమాజంలో ఉంది.
ఒక్కరే ఉన్న పిల్లలు, తోబుట్టువులున్న పిల్లల మానసిక ఆరోగ్యాలను పోల్చుతూ చైనాలో అమెరికాలో ఒక అధ్యయనం చేశారు.
కుటుంబంలో ఎక్కువ మంది పిల్లలుంటే వారికి మానసిక ఆరోగ్య సమస్యలు వచ్చే ముప్పు ఎక్కువని ఈ అధ్యయనంలో తేలింది.
మానసిక సమస్యలైన ఒత్తిడి, ఆందోళన, ఓసీడీ వంటివి తోబుట్టువులు ఉన్నవారికంటే ఒక్కరే ఉన్న పిల్లల్లోనే తక్కువని తేలింది.
ఒక్కరైన పిల్లలే ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటున్నారట. తోబుట్టువులు లేని పిల్లలు ఐక్యూ టెస్టుల్లో, స్కూల్ సబ్జెక్టుల్లో మెరుగ్గా ఉంటున్నారు
తల్లిదండ్రులు వీరికి ఎక్కువ సమయం, ఇతర వనరులు కేటాయించడమే అందుకు కారణమని కొందమంది పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
చదువుల పరంగా దీర్ఘకాలంలో తేడా రావొచ్చేమోకానీ, ఒక్కరే సంతానమైతే చిన్నప్పుడు తల్లిదండ్రులు చూపించే సంరక్షణ వారికి లాభం చేకూర్చేలా ఉందంటున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి