బీరు తాగితే దోమలు ఎక్కువగా కుడతాయా.? నిజం ఏంటి.? 

22 August 2025

Prudvi Battula 

దోమలు మనుషుల వైపు ఆకర్షితులవడానికి చాలా కారణాలున్నాయన్నారు అమెరికాలోని న్యూ మెక్సికో స్టేట్ యూనివర్శిటీలోని ప్రొఫెసర్.

ముఖ్యంగా శరీర వాసన, చర్మం ఉష్ణోగ్రతతో పాటు శరీరం నుంచి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్, ఆల్కహాల్ కూడా కారణమవుతుందని తెలిపారు.

ఇదిలా ఉంటే మొత్తం 3500 కంటే ఎక్కువ జాతుల దోమలు ఉన్నాయి.  వీటిలో కొన్ని రకాల దోమలు మాత్రమే రక్తం తాగుతాయి.

అయితే మనిషిని కేవలం ఆడ దోమ మాత్రమే కుడుతుంది. దీనికి కారణం ఆడ దోమలకు వాటి గుడ్లకు ప్రోటీన్ అవసరం ఉంటుంది.

మనిషి రక్తం నుంచి దోమలకు ఈ ప్రోటీన్‌ లభిస్తుంది. ఇక ఏ బ్లడ్ గ్రూప్‌ ఉన్న వారిని దోమలు తక్కువగా కుడుతాయని పలు అధ్యయనాల్లో తేలింది.

అలాగే ఓ బ్లెడ్‌ గ్రూప్‌ ఉన్న వారిని ఎక్కువగా కుడుతాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

అంతేకాకుండా బీరు తాగే వారికి కూడా దోమలు ఎక్కువగా కుడుతాయని తాజా అధ్యయనంలో తేలింది. ఇదండీ దోమ కుట్టడం వెనకాల ఉన్నఅసలు అర్థం.

అందుకే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకొనేవారు జాగ్రత్త వహించి.. ఇది తీసుకోవడం తగ్గించడం లేదు పూర్తిగా మానుకోవడం మంచిది.