వాహనాల టైర్లకు వింత డిజైన్‌లు ఎందుకు ఉంటాయో మీకు తెలుసా.?
26 August 2025
Prudvi Battula
ఏ వాహనం టైర్లను అయినా పరిశీలిస్తే అవి నలుపు రంగులో ఉంటాయి. కానీ వాటి వింత డిజైన్‌లలో మాత్రం వత్యాసం ఉంటుంది.
టైర్ల రూపకల్పనలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయంటున్నారు టెక్ నిపుణులు. వివిధ కంపెనీల టైర్లు వివిధ డిజైన్‌లను కలిగి ఉంటాయి.
ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటంటే టైర్లపై డిజైన్లు చేయాల్సిన అవసరం ఏంటి అని. ఇందుకు కారణంగా భద్రత కోసమే.
సాధారణ రహదారి పొడిగా ఉండటం, తడిగా ఉండటం, మంచుతో ఇలా రకరకాల రహదారుపై జారిపోకుండా టైర్లకు ఈ డిజైన్ వేస్తారనట.
టైర్లు ప్లాట్ అయినప్పుడు వాహనాలు జారీపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకు ప్రమాదాలు జరుగకుండా టైర్లకు ఇలా డిజైన్లు సృష్టిస్తారట.
టైర్లను రూపొందించినప్పుడు వాహనాలు స్లిప్ కాకుండా, ఎలాంటి రహదారిపై వెళ్లినా టైర్లకు ఏం కాకుండా ఇవి సహాయపడతాయి.
టైర్ల తయారీలో రూపొందించిన ఈ డిజైన్లు భద్రత విషయంలో కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. అంతేకాదు టైర్లు ఎక్కువ కాలం పాటు సర్వీసు ఇస్తాయి.
ఇలా టైర్లకు రకరకాల డిజైన్లు వేయడం వల్ల టైర్ల నాణ్యత మెరుగు పడటమే కాకుండా ఎక్కువ రోజుల పాటు పని చేస్తాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
పచ్చి మిరపకాయలు ఇలా కట్ చేస్తే.. చేతులు మంటేక్కావు..
రోజుకు మూడు రంగులు మార్చే 1100 ఏళ్ల లక్ష్మీదేవి విగ్రహం.. ఎక్కడంటే.?
నవరాత్రుల్లో గణేశుడిని రోజుకో రూపంలో పూజిస్తే.. కోరికలన్నీ తీరిపోయినట్టే..