షాకింగ్ న్యూస్.. వంట గదిలో పాత్రలకూ ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందని తెలుసా..?

Venkata Chari

31 Jul 2025

Credit: Instagram

వంటగది పాత్రలకు కూడా గడువు తేదీ ఉంటుందని మీకు తెలుసా? వీటిని ఎన్ని రోజుల తర్వాత మార్చాలో ఇప్పుడు తెలుసుకుందాం..

రోజువారీ జీవితంలో ఉపయోగించే చాలా వస్తువులకు గడువు తేదీ ఉంటుంది. అలాగే, వంటగదిలో ఉపయోగించే పాత్రలకు కూడా గడువు తేదీ ఉంటుందని మీకు తెలుసా.

అవును, వంటగదిలో ఉపయోగించే పాత్రలు శాశ్వతం వాడేందుకు మంచిది కాదు. వీటిని తప్పక మార్చుతుండాలి.

ఈ పాత్రలను ఒక నిర్దిష్ట సమయం తర్వాత మార్చడం అవసరం. మరి వీటిని ఎలా గుర్తించాలని కంగారు పడుతున్నారా.?

నాన్-స్టిక్ ఫ్రైయింగ్ పాన్‌లను 2 సంవత్సరాలకు ఒకసారి మార్చాలి. లేదంటే ఇంట్లో అంతా అనారోగ్యం పాలిట పడతారు.

వండే పదార్థాలు మాడిపోవడం లేదా నాన్-స్టిక్ పూత ఊడిపోవడం ప్రారంభించే ముందు వీటిని మార్చాలి.

మీ వంటగదిలో ప్లాస్టిక్ కటింగ్ బోర్డు ఉంటే, ఒక సంవత్సరం తర్వాత దానిని మార్చాలి. లేదంటో  ఆ ప్లాస్టిక్ అంతా మనం తినే ఆహారంలో చేరుతుంటుంది.

ప్లాస్టిక్ కటింగ్ బోర్డు‌లో ఉన్న ప్లాస్టిక్ ఒక సంవత్సరం లోపు కుళ్ళిపోవడం ప్రారంభమవుతుంది. ఇది మన ఆరోగ్యానికి హానికరం.