టుట్టి ఫ్రూటీ ఇంట్లో సింపుల్‎గా తయారు చేసుకోవచ్చు ఇలా

30 July 2025

Prudvi Battula 

టుట్టి ఫ్రూటీ.. దిన్ని మీరు ఎదో సమయంలో తినే ఉంటారు. వీటిని జ్యూస్ షాపులో లస్సి, సలాడ్ వంటి వాటిలో కూడా వేస్తూ ఉంటారు.

చాలామందికి వీటిని చెర్రీస్ అని షాపుల్లో అమ్ముతూ ఉంటారు. అలాగే పిల్లల నుంచి పెద్దల వరకు కొనుక్కొని తింటూ ఉంటారు.

నిజానికి ఇవి చెర్రీస్ కాదని వాటిని అమ్మే షాప్ వాళ్ళతో పాటు చాలామందికి తెలియని విషయం. అలాగని ఇవి చెట్లకు కూడా పండవు.

వీటిని తయారు చేస్తారు. ఎలా అనే కదా మీ సందేహం. ఆగండి.. కంగారు వద్దు ఈ రోజు ఇందులో తెలుసుకుందాం పదండి..

టుట్టి ఫ్రూటీ తయారు చేయడం కోసం పచ్చి బొప్పాయిని ఎక్కువగా ఉపయోగిస్తారు. రంగు కోసం కొన్ని పదార్దాలు కలుపుతారు.

కొంతమంది టుట్టి ఫ్రూటీ తయారి కోసం పుచ్చకాయ తొక్కలను వాడుతారు. రుచి కోసం షుగర్ వంటి తీపి పదార్దాలు వాడుతున్నారు.

అలాగే కొన్ని రకాలు పండ్ల కలయికతో కూడా ఇవి తయారు అవుతాయి. ఇది పాశ్చాత్య శైలి డెజర్ట్‌ అయినప్పటికీ ఇండియాలో కూడా తయారు చేస్తారు.

అదేండీ.. పచ్చి బొప్పాయి, పుచ్చకాయ తొక్కలు, అలాగే కొన్ని రకాల పండ్లతో టుట్టి ఫ్రూటీని మీరు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.