జపాన్‎కి సొంత సైన్యం లేదని మీకు తెలుసా.? కారణం ఏంటంటే.?

23 August 2025

Prudvi Battula 

జపాన్ పాటిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 9 ప్రకారం, జపాన్ దేశం సైన్యాన్ని కలిగి ఉండటానికి అనుమతి లేదు.

జపనీస్ భూమిని రక్షించడానికి జపాన్ సెల్ఫ్ డిఫెన్సె ఫోర్స్ (JSDF) అనే ఆత్మరక్షణ దళం మాత్రమే కలిగి ఉంది.

మాజీ ప్రధాన మంత్రి షింజో అబే ఈ ఆర్టికల్ 9 లో మార్పును ప్రతిపాదించినప్పటికీ సొంతంగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకోలేదు.

జపాన్‌ దేశానికి సొంత సైన్యం లేకపోవడానికి కారణం ఏంటో, ఎలా ఎందుకు చేస్తుందో, ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం పదండి.

రెండవ ప్రపంచ యుద్ధంలో ఓటమి తరువాత, జపాన్ లొంగిపోవలసి వచ్చింది. ఆ తరువాత దాని రాజ్యాంగాన్ని అమెరికా రాసింది.

జపాన్ తనలో శాశ్వత సైన్యాన్ని కలిగి ఉండటానికి అమెరికా అనుమతించలేదు. జపాన్ తన భద్రత కోసం అమెరికాపై ఆధారపడి ఉంది.

జపాన్-యునైటెడ్ స్టేట్స్ మధ్య భద్రతా ఒప్పందం ఉంది. జపాన్ దీవులను రక్షించడానికి యునైటెడ్ స్టేట్స్ తన దళాలను మోహరించవచ్చు.

ప్రస్తుత కాలంలో జపాన్‌కు స్టాండింగ్ ఆర్మీ లేకపోవడం దేశ భద్రత ఎప్పటికైనా ప్రమాదమే అని అంటున్నారు నిపుణలు.